హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు కార్లు ఢీ.. తప్పిన ప్రమాదం

CTR: పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై బిజీ మిట్టూరు వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. తిరుపతి వైపు వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో రెండు కార్ల ముందు, వెనుక భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. హైవే సిబ్బంది వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.