హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరిడమ్మ తల్లి ఆలయం ప్రారంభం

AKP: పాయకరావుపేట మండలం పెంటకోట బీచ్ రోడ్డులో కొత్తగా నిర్మించిన మరిడమ్మ తల్లి ఆలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, పార్టీ మండల అధ్యక్షుడు గడ్డమూరి శ్రీనివాసరావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.