ASR: అరకు నియోజకవర్గంలో వైసీపీకి మరింత బలం చేకూరిందని ఆ పార్టీ నేతలు తెలిపారు. డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు కిండంగి లైకోన్, అంజోడ, జాంకరవలస, జాముగూడ, బొందుగూడ గ్రామాలకు చెందిన సుమారు 100కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే మత్స్యలింగం సమక్షంలో వైసీపీలో చేరారు. డుంబ్రిగుడ మండల వైసీపీ అధ్యక్షుడు పరశురామ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో చేరికలు


