హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాత్రికేయులపై దాడులు సహించేది లేదు'

అన్నమయ్య: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాసిన విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఖండించారు. గురువారం రాజంపేట సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఏవోకు వినతిపత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.