SKLM: శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో రవిబాబు గురువారం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు ఐచ్చిక/సాధారణ సెలవు ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అన్ని విద్యాసంస్థలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు పాఠశాలలకు సెలవు'


