హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక శాఖ సేవలు కీలకం - MLA

VZM: ప్రమాద నష్ట నివారణలో, ప్రజల రక్షణ భద్రత విషయంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్.కోట MLA కోళ్ల లలితకుమారి అన్నారు. గురువారం స్దానిక అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన నూతన శకటం, అత్యాధునిక రక్షణ సామాగ్రిని ఆమె ప్రారంభించారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు జాతీయ విపత్తుల సమయంలో అగ్నిమాపక శాఖ అత్యంత కీలకమని ఆమె తెలిపారు.