హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనవాని కార్యక్రమంలో 19 ఫిర్యాదులు

AKP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం నర్సీపట్నం నియోజకవర్గ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. శానిటేషన్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, విద్యుత్ తదితర సమస్యలపై 19 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.