ప్రకాశం: తర్లుపాడు మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సామా సుబ్బారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేతగుడిపి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు అందిస్తున్న రాగిజావను స్వయంగా తాగి నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో విద్యా బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
తర్లుపాడులో డీఈవో ఆకస్మిక తనిఖీలు


