హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన

కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఆళ్లగడ్డలో గురువారం న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన ప్రదర్శన చేశారు. అధ్యక్షుడు శివరామిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో గత ప్రభుత్వం హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు.