హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సంపద కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి'

AKP: సంపద కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బీకేపల్లిలో సంపద కేంద్రాన్ని గురువారం సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్మి కంపోస్ట్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. సంపద కేంద్రాల్లో సేంద్రియ ఎరువులను తయారుచేసి విక్రయిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందన్నారు.