హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పూల సాగుపై ప్రత్యేక శిక్షణ'

కృష్ణ: ఉంగుటూరు మండలం అత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పూల విత్తనాల మినీ కిట్ల వినియోగం, పరాగసంపర్కం, జీవవైవిధ్యంపై అవగాహన కల్పించారు. కొత్త వంగడాల ఎంపిక, సాగు, నిర్వహణ పద్ధతులను నిపుణులు వివరించారు. నూతన విధానాలతో మిత్ర పురుగులు పెరిగి, పరాగసంపర్కం మెరుగై దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.