శ్రీకాకుళం వన్ టౌన్ ఎస్సై జగన్నాథరావు ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచడం, పెండింగ్ చలానాల క్లియరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ, రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల విస్తృత తనిఖీలు


