హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'

KRNL: జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఇవాళ డీసీసీ అధ్యక్షుడు క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు. కొత్త ఎస్‌ఎస్‌ ట్యాంకులు, పైప్‌లైన్లు ఏర్పాటు చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ప్రజలకు నిరంతర తాగునీరు అందేలా శాశ్వత చర్యలు చేపట్టాలని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.3,000 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు.