హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీవారిని దర్శించుకున్న సినీ నిర్మాత

TPT: తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కూతురి వివాహ వేడుక అనంతరం ఆయన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధన్యత సంతరించుకుంది.