కోనసీమ: ఆలమూరు యూనియన్ బ్యాంకు ఉద్యోగిని గానుగుపెంట సుప్రియ మృతదేహాన్ని కపిలేశ్వరపురం మండలం కాలేరు వద్ద కాలువలో పోలీసులు గుర్తించారు. సోమవారం చొప్పెల్ల కాలువ వద్ద ఆమె గల్లంతైనట్లు గుర్తించి SI నరేష్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు గురువారం సుప్రియ మృతదేహం ఆచూకీ లభించింది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో బ్యాంకు ఉద్యోగిని మృతదేహం


