AKP : అచ్చుతాపురం మండలంలో మడతూరు శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపుపై గురువారం పోలీసులు దాడి చేశారు. టిఫిన్ సెంటర్ వెనుక మద్యం విక్రయిస్తున్న అప్పికొండ శ్రీను (42)ను ఎస్సై కె.సుధాకర్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 55 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం శ్రీనును రిమాండ్‌కు తరలినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం విక్రయం.. వ్యక్తి అరెస్టు


