హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో కాలం.. వాడిన తాడిచెట్లు!

బాపట్ల జిల్లాలో కల్ప వృక్షానికి కష్టకాలం వచ్చింది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తాడిచెట్లు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయి. ఎంతటి తీవ్ర ఉష్ణోగ్రతలైనా తట్టుకొని నిలబడే తాడిచెట్లు వాడిపోతున్నాయి. ఈ చెట్లు అత్యంత లోతుకు వెళ్లి నీటి తేమను తీసుకొని అధిక ఉష్ణోగ్రతలో కూడా పచ్చగా ఉంటాయి. తాడి చెట్లే వాడిపోతే , ఇక పంటల పరిస్థితి ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.