CTR: ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకుని సోమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమ కాటుతో వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి డాక్టర్ రాజకుమార్ సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలని కోరారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'


