హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురుగు కాలువలతో అవస్థలు

CTR: బంగారుపాళ్యెం మండలం నల్లంగాడు పంచాయతీ మాదిగపల్లిలో మురుగు కాలువలు వ్యర్థాలతో నిండిపోయాయి. మురుగు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, దుర్వాసనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కాలువలను శుభ్రం చేసి మురుగు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.