హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సులో ఆకతాయిల వీరంగం..!

W.G: పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెంకు చెందిన ముగ్గురు ఆకతాయిలు బుధవారం ఆర్టీసీ బస్సులో వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆచంట నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్న బస్సును బ్రాహ్మణ చెరువు వద్ద బైక్ అడ్డుగా నిలిపి, బస్సులోకి ప్రవేశించి సిబ్బంది, ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు సమాచారం. కాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.