PLD: నరసరావుపేటలో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న పారా మెడికల్ సిబ్బంది ఆగస్టు 21 నుంచి ఓల్డ్ హాస్పిటల్ ఆవరణలో శాంతియుత ధర్నాకు సిద్ధమయ్యారు. 15 రోజుల పాటు విధులకు ఆటంకం కలగకుండా నిరసన కొనసాగిస్తామని కలెక్టర్‌కు, సూపర్‌డెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర సేవలతో సహా విధులు నిలిపివేసి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పారా మెడికల్ సిబ్బంది ధర్నాకు సిద్ధం


