AKP: విద్యా రంగాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని SFI జిల్లా అధ్యక్షుడు బి. బాబ్జి డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని, విద్యార్థులకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తామని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యారంగాన్ని పరిరక్షించాలి: SFI


