TPT: ఓజిలి మండలం నెమళ్లపూడి గ్రామంలోని చెరువు కలుజు పనులను జలవనరుల శాఖ డీఈ విశ్వనాథ్, ఏఈ వీరాస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణ పనుల నాణ్యత, సాంకేతిక ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నెమళ్లపూడి చెరువు కలుజు పనుల పరిశీలన


