హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డబుల్ బొనాంజా.. ఆక్వా రైతుల హర్షం!

WG: ఆక్వా రైతులకు రాయితీ విద్యుత్ అమలుపై ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసింది. యూనిట్ రూ.1.50 చొప్పున రాయితీ విద్యుత్ అందించనుండగా, కోల్డ్ స్టోరేజీలకు కూడా రాయితీ వర్తించనుంది. మరోవైపు రొయ్యల ధరలు పెరగడం రైతులకు మరింత ఊరటనిస్తోంది. నెలరోజుల క్రితం కిలోకు రూ.220గా ఉన్న రొయ్యల ధర ప్రస్తుతం రూ.280కు చేరడంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.