హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెల్మెట్ ధరించిన వారికి గులాబీలతో అభినందనలు

VZM: గుర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ నారాయణరావు గురువారం స్దానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు ఫైన్ విధించారు. అలాగే హెల్మెట్‌ ధరించిన వాహనదారులకు వారికి గులాబీ పువ్వులు అందించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు.