హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మార్కాపురంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు'

ప్రకాశం: భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను గురువారం మార్కాపురం గడియారం సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. రాజీవ్ గాంధీ సామాన్య ప్రజలతో నేరుగా కలిసిపోయే వ్యక్తి అని, ఆయన హయాంలోనే నవోదయ విద్యాలయాలు ప్రారంభమైనట్లు వారు తెలిపారు.