VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండప వేదికపై అధీష్టించారు. వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ ఈ పూజా కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రి అప్పన్నకు 'స్వర్ణ పుష్పార్చన'


