హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం గ్రామస్తుల ఇబ్బందులు

కృష్ణా: గూడూరు మండలం రామానుజవతర్లపల్లి గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం చెరువులో నీరు అడుగంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో పాటు పశువులకు కూడా నీటి కొరత ఏర్పడింది. తక్షణమే చెరువులో నీరు నింపేందుకు చర్యలు చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రాజులపాటి జామదగ్ని కోరారు.