హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానసిక ఒత్తిడిపై విద్యార్థులకు అవగాహన

ASR: డుంబ్రిగూడ కేజీబీవీ పాఠశాలలో గురువారం ఆత్మహత్యల నివారణ, బాల్య వివాహాలు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కెరీర్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ కౌన్సిలర్‌ హెచ్.బి రంజిత్‌ విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సమస్యలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు.