కోనసీమ: ఆత్రేయపురం రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణం ఐదేళ్లుగా పునాదులకే పరిమితమైంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుత పాలకులైనా సమస్య గుర్తించి భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయం వ్యవసాయాధికారి పట్టాబి రామయ్య వద్ద ప్రస్తావించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పునాదులకే పరిమితమైన భవనం


