హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాసన మండలిలో వైసీపీ ఆందోళన

GNTR: అమరావతిలో జరుగుతున్నఏపీ శాసనమండలి సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం రేగింది. దీంతో మండలి వాయిదా పడింది.