హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ

VZM: జలవనరుల శాఖ ఏఈ చింతల మహేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. చీపురుపల్లి ఇంఛార్జ్ స్పెషల్ ఆఫీసర్‌గానూ విధులు నిర్వహిస్తున్న మహేష్ కోళ్ల ఫామ్ కోసం మీసాల ప్రశాంత్ అనే రైతు వద్ద రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. ప్రశాంత్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.