హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడుగంటిన ఉప్పారపల్లె చెరువు

అన్నమయ్య: పెద్దమండ్యం మండలం ఎర్రగుట్టపల్లె మార్గంలో ఉన్న ఉప్పారపల్లె చెరువు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోతోంది. చెరువులో నీటిమట్టం అడుగంటడంతో పశువులు, గొర్రెలకు తాగునీరు దొరకక ఇబ్బందిగా మారిందని స్థానిక జీవాల కాపరులు తెలిపారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పరిశీలించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి వసతులు కల్పించాలని కోరుతున్నారు.