అన్నమయ్య: పెద్దమండ్య మండలంలోని అర్హులైన యువతీ, యువకులకు ఈ నెల 30వ తేదీ వరకు ఓటర్ నమోదు కోసం ప్రత్యేక అవకాశం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2026 ఆగస్టు 30 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అవసరమైన ఫారాలు బీఎల్‌వోల వద్ద లభిస్తాయన్నారు. మండలంలోని అర్హులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దమండ్యంలో ఓటర్ నమోదుకు ప్రత్యేక అవకాశం


