హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురుగునీటితో మాచవరం వాసుల అవస్థలు

కృష్ణా: మచిలీపట్నంలోని మాచవరం దాసరి వారి వీధిలో డ్రైనేజీ వ్యవస్థ లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమలు, పందుల బెడదతో అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.