హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షం కోసం మైనార్టీల ప్రత్యేక ప్రార్థనలు

కృష్ణా: వర్షాలు సమృద్ధిగా కురవాలని పెడనలో మైనారిటీలు ప్రార్థనలు నిర్వహించారు. గుడివాడ బైపాస్‌ రోడ్డులోని ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్‌ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అల్లాను ప్రార్థిస్తూ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.