హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వింత ఘటన.. మళ్లీ పెళ్లి చేసుకున్న దంపతులు!

KKD: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. గతంలో వివాహమైన 9 జంటలు మళ్లీ పెళ్లి చేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో జరిగిన వివాహాల్లో దోషాలు ఉన్నాయని, ఆ కష్టాలు తీరాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలని సిద్దాంతి చెప్పడంతో ఇలా చేశామని దంపతులు చెప్పుకొచ్చారు. వీరంతా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, ఆనందపురం మండలాలకు చెందినవారిగా తెలుస్తోంది.