హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23న జిల్లాలో యోగా పోటీలు

బాపట్లలో చీలురోడ్డు పాండురంగస్వామి ఆలయం వద్ద ఎకో హౌస్‌లో జిల్లా స్థాయి యోగా ఛాంపియన్‌షిప్ పోటీలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు కళ్లం హరినాథరెడ్డి తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో బాలురు, బాలికలు, పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  గెలుపొందిన వారు రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.