హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోరుకొండలో చెరువుల మారిన రహదారి

EG: కోరుకొండలో చినుకులు పడితే ప్రధాన రహదారిపై కాలవను మైమరిపించడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వర్షం నీరు పోయే మార్గంలేక రోడ్డుపైనే నిలవడంతో మురుకుకూపం తయారై, ప్రజల పాలిట పెను శాపంగా మారింది. దీంతో ఆ ప్రదేశం ప్రమాదాలకు నిలయంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.