హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అడవిలో తప్పిపోయిన భక్తులు సురక్షితం

KDP: అడవిలో తప్పిపోయిన ప్రొద్దుటూరు వాసులు అహోబిలం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పావన నరసింహస్వామి ఆలయం నుంచి ఎగువ అహోబిలం వైపు వెళ్తున్న ఆరుగురు భక్తులు తప్పిపోయారు. సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ SI ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, అహోబిలం ఆలయ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారిని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.