PLD: మేడికొండూరు-సత్తెనపల్లి మధ్య అర్ధరాత్రి పొన్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో బుధవారం అర్ధరాత్రి దాడి చేశాడు. రాయిదాడిలో బస్సు అద్దం ధ్వంసం కాగా, రాయి బస్సు లోపల పడింది. డ్రైవర్ వెంటనే డయల్ 100 కు సమాచారం అందించి, సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై దాడి


