హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టిలో కలిసిపోతున్న అంబులెన్స్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి భక్తులు, దాతలు విరాళంగా అందజేసిన అంబులెన్స్ అధికారాల నిర్లక్ష్యంతో నిరూపయోగంగా మారుతున్నాయి. దేవస్థానం పరిధిలోనున్న టూరెస్ట్ బస్టాండ్ ప్రాంతంలో తుప్పు పట్టి, మట్టి పాలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు పనులు చేయించి భక్తులకు అందుబాటలోకి తీసుకురావాలని కోరుతున్నారు.