హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విశాఖపట్నం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన SC యువతకు SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు EDసత్య పద్మ తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిషియన్, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యూటీషియన్, ప్లంబింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన ఎస్సీ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.