అల్లూరి ఏజెన్సీ మన్యం కాఫీ పంట ఈ ఏడాది ముందుగానే చేతికొచ్చింది. డిసెంబర్, జనవరిలో వచ్చే కాఫీ పండ్లు ఆగస్టులోనే పక్వానికి వచ్చాయి. జీకే వీధి మండలం గొల్లపల్లిలో కాఫీ పండ్ల సేకరణ ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కొన్ని రకాల కాఫీ మొక్కలు ముందుగానే పండుతాయని ఉద్యానశాఖ అధికారిణి అరుణకుమారి తెలిపారు. నాణ్యత, దిగుబడిపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముందుగానే పక్వానికి వచ్చిన మన్యం కాఫీ


