హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీశైలం డ్యామ్ వద్ద రోడ్డు ప్రమాదం

NDL: శ్రీశైలం డ్యామ్ వద్ద బొలెరో వాహనం బోల్తా పడి 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు బొలెరోలో వెళ్తుండగా డ్యామ్ రెండో టర్నింగ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడిన వారిని 108 వాహనం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.