హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ ముద్ర ఉన్న తూకపు యంత్రాలనే వాడాలి'

NDL: వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాలని తూనికలు, కొలతల శాఖ నంద్యాల డివిజనల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు పేర్కొన్నారు. ఆళ్లగడ్డలోని దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని ఎలక్ట్రానిక్ కాటాలకు ముద్రలు వేశారు. చౌకదుకాణాల డిజిటల్ కాటాలను సరిచేసి, సీళ్లకు ముద్రలు వేశారు.