హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించాలి'

పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సాగు భూములు బీడు భూములుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు.