హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రేత జైలుకు!

PLD: సత్తెనపల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన తన్నీరు అడవయ్యపై అధికారులు పిట్ అండ్ ఎన్డీపీఎస్ యాక్టు-1988 ప్రయోగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. అక్రమంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నందునే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.