హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిర్చి పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి!

గుంటూరు మిర్చికి విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో తేమ శాతం ఎక్కువగా ఉందని శ్రీలంక, చైనా వంటి దేశాలు స్టాక్‌ను వెనక్కి పంపించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు రైతులకు కొన్ని సూచనలు అందజేస్తున్నారు. రసాయనాలు వాడకుండా, చీడపీడలను తొలి దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చని చెబుతున్నారు.