హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొండిగోడలతోనే ఆగిన నిర్మాణం

సత్యసాయి: ముదిగుబ్బ ప్రాథమిక ప్రభుత్వాసుపత్రి నిర్మాణం ఏడేళ్లుగా నిలిచిపోవడంతో మొండిగోడలతో దర్శనమిస్తోంది. మేజర్ పంచాయతీతో పాటూ, 42వ జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో క్షతగాత్రులు ఆసుపత్రికి చికిత్స కోసం వస్తుంటారు. తొమ్మిది పడకలతో నిర్మించేందుకు రూ. కోటి వ్యయంతో 2018లో భవనం నిర్మించినా నిధులు రాకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయని స్థానికులు వాపోతున్నారు.